క్యాన్సర్ పిల్లలకు పూజా విరాళం

January 20, 2020


img

అల వైకుంఠపురంలో...సినిమా హీరోయిన్ పూజా హెగ్డే క్యాన్సర్ వ్యాదితో బాధపడుతున్న చిన్నారుల వైద్య చికిత్సల కోసం రూ.2.5 లక్షలు విరాళం ఇచ్చారు. క్యూర్ ఫౌండేషన్ సంస్థ అధ్వర్యంలో హైదరాబాద్‌ గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాది బారిన పది బయటపడ్డ చిన్నారులు వారి తల్లితండ్రులు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నటి పూజా హెగ్డే అటువంటి పిల్లలకు ఆర్ధికసాయం చేస్తున్న క్యూర్ ఫౌండేషన్‌కు ఈ విరాళం అందజేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నా కుటుంబంలో...నా స్నేహితులలో చాలామండి వైద్యులే ఉన్నారు. కనుక అనారోగ్యంతో ఉన్నవారి బాధలు, కష్టాలు ఏవిధంగా ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక అటువంటి వారి కోసం ఏమైనా చేయాలనుకొంటుండగా  క్యూర్ ఫౌండేషన్ వారిని కలవడం జరిగింది. క్యాన్సర్ వ్యాదితో బాధపడుతున్న చిన్నారుల కోసం వారు చేస్తున్న సహాయసహకారాల గురించి తెలుసుకొని నేనూ ఆర్ధికసాయం అందజేయగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలకు అందరూ ఆర్ధికసాయం అందించగలిగితే అవి ఎందరి జీవితాలలోనో వెలుగులు నింపుతాయి,” అని పూజా హెగ్డే అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష