విజయ్ దేవరకొండ-పూరీ మూవీ ప్రారంభం

January 20, 2020


img

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాద్ కాంబినేషన్‌లో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం ఉదయం ముంబైలో ఈ సినిమా పూజాకార్యక్రమం జరిగింది. తరువాత నటి చార్మీ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి లాంఛనంగా సినిమా షూటింగ్ ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా పూజాకార్యక్రమం, ముహూర్తపు షాట్‌కు సంబందించి కొన్ని ఫోటోలను ఛార్మీ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. 


విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ఇద్దరూ రొమాన్స్, యాక్షన్ సినిమాలకు చాలా ఫేమస్ కనుక ఈ సినిమా కూడా అందుకు తగ్గట్లుగానే ఉండబోతోంది. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్‌గా బాలీవుడ్ నటి అనన్య పాండేను ఎంపికచేసినట్లు తాజా సమాచారం.


Related Post

సినిమా స‌మీక్ష