RRR లో ఆ స్టార్ కూడా..?

January 18, 2020


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ను అలరిస్తుంది. బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్, తారక్ కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా సినిమాలో పోలీస్ పాత్రలో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది.

రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ఈగ సినిమాలో సుదీప్ విలన్ గా నటించాడు. బాహుబలి ది బిగినింగ్ లో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించి అలరించాడు. ఇక ఇప్పుడు ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్ లో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. తెలుగు సినిమాలపై సుదీప్ చూపిస్తున్న ఆసక్తికి ఇక్కడ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరి ఈసారి సుదీప్ ను జక్కన్న ఎలా చూపించనున్నారో తెలియాల్సి ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష