బన్ని-సుకుమార్ టైటిల్ అదేనా..?

January 18, 2020


img

అల వైకుంఠపురములో సూపర్ సక్సెస్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా శేషాచలం అని టైటిల్ ఫిక్స్ చేశారట చిత్రయూనిట్. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఓ పక్క రంగస్థలంతో సుకుమార్ కెరియర్ బెస్ట్ హిట్ అందుకోగా ఆ సినిమాను మించేలా తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టగా అల్లు అర్జున్ త్వరలో షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష