ఫుల్ ఫాంలో పూజా హెగ్దె..!

January 17, 2020


img

ప్రస్తుతం సౌత్ లో సూపర్ ఫాంలో ఉన్న భామ ఎవరు అంటే అందరు చెప్పే ఒకే ఒక్క పేరు పూజా హెగ్దె. మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా అల్లు అర్జున్ తో చేసిన డిజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన అమ్మడు అప్పటి నుండి అదే ఫాం కొనసాగిస్తుంది. లాస్ట్ ఇయర్ మహేష్ మహర్షితో హిట్ అందుకున్న పూజా హెగ్దే ఈ సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా హిట్ తో పూజా డిమాండ్ మరింత పెరిగిందని చెప్పొచ్చు.

ప్రభాస్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్న పూజా హెగ్దె.. అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది. పవర్ స్టార్ పింక్ రీమేక్ లో కూడా అమ్మడికి ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. మొత్తానికి పూజా హెగ్దె కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఓ పక్క రష్మిక కూడా వరుస ఆఫర్లు దక్కించుకుంటుండగా పూజా హెగ్దె మాత్రం తన గ్లామర్ తో క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష