సరిలేరు నీకెవ్వరు ఇది నా బెస్ట్ డెశిషన్

January 17, 2020


img

సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం హన్మకొండలో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. చిత్రయూనిట్ మొత్తం పాల్గొన్న ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మహేష్ స్పీచ్ అదిరిపోయింది. తనకు ఇలాంటి సక్సెస్ ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఇక నాలుగైదు సినిమాల నుండి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయడంతో మహర్షి తర్వాత అనీల్ చెప్పిన కథ నచ్చి ఓకే చెప్పానని.. అయితే ఎఫ్-2 చూశాక వెంటనే చేయాలని అనుకుని ఈ సినిమా చేశామని అన్నారు మహేష్. సినిమాలో డైలాగులు చాలా బాగా వచ్చాయని.. రమణ డైలాగ్ తో స్పీచ్ మొదలు పెట్టిన మహేష్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా కలిసి 100 కోట్ల షేర్ పోస్టర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా అనిపించిందని అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కు పెద్ద థ్యాంక్స్ అన్నారు మహేష్. సినిమాకు పనిచేసిన టెక్నిషియల్స్ అందరికి థ్యాంక్స్ చెప్పారు. 

ఈ సంక్రాంతి ఎప్పటికి మర్చిపోనని.. స్టేజ్ మీద డైలాగులు చెప్పనని.. అయితే ఇలాంటి బ్లాక్ బస్ట్ సినిమా ఇచ్చాక డైలాగ్ చెప్పకపోతే ఎలా అంటూ డైరక్టర్ అనీల్ రావిపుడిని పిలిచి బ్లాక్ బస్ట్ సినిమానే కాదు బ్లాక్ బస్టర్ స్పీచ్ కూడా ఇచ్చావ్ బ్రదర్ అన్నారు మహేష్. ఇక మీ ప్రేమకు.. మీ ఆప్యాయతకి.. మీ అభిమానానికి టేక్ ఏ బౌ థ్యాంక్యూ అంటూ స్పీచ్ ముగించారు మహేష్. 



Related Post

సినిమా స‌మీక్ష