అభిమానం అంటే అంతే.. ఎక్కడికైనా తీసుకెళ్తుంది..!

January 17, 2020


img

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దెకి ఓ వీరాభిమాని చేసిన పనికి షాక్ అయ్యింది. అతని పేరు భాస్కర్ రావు.. ఆమె సినిమాలు చూస్తూ అభిమానం పెంచుకున్న భాస్కర్ రావు ఎలాగైనా సరే ఆమెను కలవాలని అనుకున్నాడు. అనుకోవడమే ఆలస్యం ముంబైలోని ఆమె నివాసరానికి వెళ్లి ఆమె కోసం ఇంటి ముందు వెయిట్ చేశాడు. ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా ఐదు రోజులు అలా ఇంటి ముందే ఉన్నాడు భాస్కర్ రావు.

అయితే విషయం లేటుగా తెలుసుకున్న పూజా హెగ్దే ఆ అభిమానిని పిపించి అతనితో మాట్లాడి పంపించింది. అతనితో మాట్లాడిన వీడియోని తన ఇన్ స్టాగ్రాం లో పెట్టింది పూజా హెగ్దె. తన కోసం అభిమాని ఇలా కష్టపడటం బాధగా ఉందని చెప్పిన పూజా హెగ్దె ఇలాంటివి నేను అసలు ఎంకరేజ్ చేయను.. మీరెక్కడున్నా మీ ప్రేమ.. అభిమానులే బలం అంటుంది పూజా హెగ్దె. సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న పూజా హెగ్దె.. ప్రభాస్, రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష