అల వైకుంఠపురములో అద్భుతం అంటున్న సుక్కు

January 14, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా అల వైకుంఠపురములో.  బన్ని సరసన పూజ హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ సినిమాని మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఆదివారం రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ బావా సినిమా సూపర్ అంటూ మెసేజ్ పెట్టగా.. ఆ లిస్ట్ లో దర్శకుడు సుకుమార్ కూడా చేరాడు. 

అల వైకుంఠపురములో సినిమా చూసిన సుకుమార్ తన కామెంట్స్ తో అందరిని సర్ ప్రైస్ చేశాడు. అల వైకుంఠపురములో ఒక అందమైన సినిమా అని.. త్రివిక్రమ్ గారు మరోసారి తన సత్తా చాటారని అన్నారు సుకుమార్. అల్లు అర్జున్ అద్భుతంగా నటించారని.. మ్యూజిక్.. స్క్రీన్ ప్రెజెన్స్ అంతా బాగుందని అన్నారు సుక్కు. టీమ్ అందరికి కంగ్రాట్స్ అంటూ కామెంట్ పెట్టి బన్నితో కలిసి దిగిన పిక్ పెట్టాడు. రంగస్థలం లాంటి హిట్టు కొట్టిన సుకుమార్ అల వైకుంఠపురములో సినిమాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


Related Post

సినిమా స‌మీక్ష