చైతు కమ్ముల క్రేజీ లవ్ స్టోరీ

January 14, 2020


img

కెరియర్ సూపర్ స్వింగ్ లో ఉన్న అక్కినేని హీరో నాగ చైతన్య లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీ మామ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్ తో ఎప్పుడూ లేని విధంగా కెరియర్ పీక్స్ లో ఉన్న చైతు ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.  ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు లవ్ స్టోరీ అని టైటిల్ ఫిక్స్ చేశారు. 

ఇంతకుముందే ఈ టైటిల్ ప్రచారంలో ఉండగా సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేశారు. లవ్ స్టోరీ అక్కినేని హీరోలకు బాగా యాప్ట్ అయ్యే టైటిల్ ఇదని చెప్పొచ్చు. ఫిదా తర్వాత సాయి పల్లవి శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ అంచనాలు పెంచింది. చైతూతో కూడా సాయి పల్లవి జోడి కట్టడం ఇదే మొదటిసారి. మరి క్యూట్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష