బన్నిలో ఈ కళలు నేను ఊహించలే..!

January 13, 2020


img

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమా అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. సంక్రాంతి కానుకగా ఆదివారం రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి చిత్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ చాలా హ్యాపీగా మాట్లాడారు.

సినిమా చూశాక బన్నిలో ఇన్ని కళలున్నాయా అని తనకే ఆశ్చర్యం వేసిందని అన్నారు. ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని.. ఇక వసూళ్ల లెక్కలు మిగతా విషయాలన్ని త్వరలో వెళ్లడిస్తామని అన్నారు అల్లు అరవింద్. ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ ప్రేక్షకులకు మాకు మధ్య మీడియా పనితనం గురించి కూడా మెచ్చుకున్నారు అల్లు అరవింద్. సో హిట్టు కొట్టడమే కాకుండా తండ్రిని కూడా షాక్ అయ్యేలా చేశాడు అల్లు అర్జున్.Related Post

సినిమా స‌మీక్ష