టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతుంది..!

January 13, 2020


img

సంక్రాంతి వచ్చింది అంటే సినిమాల పండుగ వచ్చినట్టే.. అయితే ప్రతి ఏడాది సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవడం.. ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం కామనే. అయితే పండుగ వేళ మూడు నాలుగు సినిమాలు రిలీజైతే కేవలం ఒకటి రెండు సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి. అయితే ఈ సంక్రాంతికి మాత్రం జనవరి 9న దర్బార్, 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంతేకాదు ఈనెల 15న కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా సినిమా కూడా రిలీజ్ అవుతుంది.

ఇప్పటికే దర్బార్ ఓన్లీ ఫర్ రజిని ఫ్యాన్స్ అనే టాక్ రాగా.. సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ అనేస్తున్నారు. ఇక నిన్న రిలీజైన అల వైకుంఠపురములో సినిమా ఈ సంక్రాంతి విన్నర్ అని తెలుస్తుంది. రిలీజైన మూడు సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాలు రెండు మంచి టాక్ తెచ్చుకోవడంతో మెగా.. సూపర్ ఫ్యాన్స్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ తోనే 250 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాలు వసూళ్లతో కూడా బాక్సాఫీస్ కళకళలాడేలా చేస్తునాయి. 2020 టాలీవుడ్ గుడ్ స్టార్ట్ అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.Related Post

సినిమా స‌మీక్ష