ఈగో లెస్ బన్ని.. ఇరగ్గొట్టేశాడు..!

January 13, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చింది అల వైకుంఠపురములో. ఆదివారం రిలీజైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ తో పాటుగా సగటు సిని ప్రేక్షకుడు సైతం సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నిటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బన్ని అదరగొట్టాడని చెపొచ్చు.

ఇక సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకుంటే సెకండ్ హాఫ్ లో ఒక మీటింగ్ లో బన్ని అందరి హీరోల పాటలకు డ్యాన్స్ వేస్తాడు. ఆ ఒక్క ఎపిసోడ్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. మహేష్, ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్, చిరు ఇలా అన్నిటితో బన్ని డ్యాన్స్ అదరగొట్టాడు. తానొక స్టార్ హీరోని కదా వాళ్ల పాటలకు డ్యాన్స్ చేయడం ఎందుకని లేనిపోని ఈగోలకు పోకుండా సినిమా హిట్ కొట్టేందుకు ఏదైనా చేయాల్సిందే అన్నట్టుగా బన్ని ఆ ఎపిసోడ్ తో అందరి స్టార్ హీరోల ఫ్యాన్స్ ను అలరించాడు. Related Post

సినిమా స‌మీక్ష