మెగా మేనళ్లుడు కూడా విప్పేశాడు

December 13, 2019


img

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రతిరోజు పండుగే. డిసెంబర్ 20న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీలో సాయి తేజ్ కు జోడీగా రాశి ఖన్నా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మెగా మేనళ్లుడు సాయి తేజ్ సిక్స్ ప్యాక్ చేశాడని తెలుస్తుంది.

సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో సినిమా స్టిల్స్ కొన్ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అందులో సాయి తేజ్ తన సిక్స్ ప్యాక్ బాడీతో విలన్ల పని పడుతున్నాడు. పిల్లానువ్వు లేని జీవితం నుండి చిత్రలహరి వరకు షర్ట్ విప్పి చూపించని సాయి తేజ్ ఈ సినిమా కోసం అది కూడా చేశాడు. కనిపించడు కాని మనోడికి కండలు బాగానే ఉన్నాయి. సిక్స్ ప్యాక్ బాడీతో సాయి తేజ్ విలన్లనే కాదు రికార్డులను బద్ధలు కొట్టాలని ఆశిద్దాం.Related Post

సినిమా స‌మీక్ష