వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ ముహుర్తం ఫిక్స్..!

December 13, 2019


img

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. కె.ఎస్ రవికుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా ఏకంగా నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ త్రెసా, ఇజబెల్లా వంటి నలుగురు ముద్దుగుమ్మలతో విజయ్ రొమాన్స్ చేస్తున్నాడు.  

రీసెంట్ గా సినిమా నుండి విజయ్ దేవరకొండ ఐశ్వర్యా రాజేష్ రొమాంటిక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. భార్యభర్తలుగా శీనయ్య, సువర్ణల పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఆ సినిమా నుండి సెకండ్ పోస్టర్ గౌతం, ఇజా అంటూ విజయ్ దేవరకొండ, ఇజబెల్లా పోస్టర్ రిలీజ్ చేశారి. ఫిబ్రవరి 14న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా టీజర్ జనవరి 3న రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి అసలు కథ ఏంటన్నది ఆ టీజర్ తో గెస్ చేసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. Related Post

సినిమా స‌మీక్ష