దొరసానికి లక్కీ ఛాన్స్..!

December 13, 2019


img

క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ కొద్దిపాటి గ్యాప్ తర్వాత తీస్తున్న సినిమా రంగమార్తండ. మరాఠిలో సూపర్ హిట్టైన నట సామ్రాట్ మూవీకి ఈ సినిమా రీమేక్. ఆ సినిమాలో నానా పటేకర్ నటించీ ఈ పాత్రలో తెలుగులో ప్రకాశ్ రాజ్ చేస్తున్నాడు. రమ్యకృష్ణ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మికను కూడా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

దొరసాని మూవీతో తెరంగేట్రం చేసి ప్రేక్షకులను మెప్పించిన శివాత్మిక తన సెకండ్ మూవీనే భారీ సినిమాలో స్థానం దక్కించుకుంది. కృష్ణంవశీ చేయి పడితే ఏ హీరోయిన్ ఫేట్ అయినా మారిపోతుంది. మరి అలానే ఈ దొరసానికి లక్ కలిసి వస్తుందేమో చూడాలి. సినిమాలో శివాత్మికకు మంచి పాత్ర దొరికిందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్న కృష్ణవంశీ ఆశిచిన స్థాయిలో సినిమా తీస్తాడో లేదో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష