నాకప్పుడే పెళ్లేంటి..!

December 13, 2019


img

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీఠలెక్కబోతుందని.. ఆమె ఒక బిజినెస్ మెన్ ను నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఈమధ్య బీచ్ ఒడ్డున లవ్ సింబల్ తో ఫోటో షేర్ చేసిన పిక్ తో కాజల్ లవ్ లో ఉందన్న వార్తలకు మరింత బలం చేకూరేలా చేశాయి. లేటెస్ట్ గా విజయవాడలో ఓ షాప్ ఓపెనింగ్ కు వచ్చిన కాజల్ ప్రస్తుతం తనకు పెళ్లి ఆలోచన లేదని ఇంకొన్నాళ్లు సినిమాలు చేస్తానని అన్నది.

తెలుగులో పెద్దగా అవకాశాలు లేని కాజల్ తమిళంలో, హిందిలో ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమాల తర్వాత అమ్మడి కెరియర్ ఖాళీనే అంటున్నారు. మరి కాజల్ నిజంగానే పెళ్లికి టైం తీసుకుంటుందా లేక ఇలా చెప్పి ఏదో ఒకరోజు సడెన్ గా పెళ్లి చేసుకుని సర్ ప్రైజ్ చేస్తుందా అన్నది చూడాలి. ఈమధ్య అమ్మడు చేసిన తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.



Related Post

సినిమా స‌మీక్ష