పవన్ కోసం మొదలు పెట్టిన థమన్..!

December 13, 2019


img

ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడని కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం గురించి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా ఆ సినిమాకు ముహుర్తం పెట్టేశారు. పవన్ లేకుండానే సినిమాకు ముహుర్తం పెట్టారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ పవన్ కోసం ఓ సాంగ్ కంపోజ్ చేశాడట కూడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న థమన్ కు పింక్ రీమేక్ రూపంలో లక్కీ ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మూవీలో నివేదా థామస్, అంజలి నటిస్తారని టాక్. 

అసలైతే అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ సినిమా తెరకెక్కిస్తారని ఎనౌన్స్ చేశారు. కాని ఆ సినిమా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టిన వేణు శ్రీరాం పవన్ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష