రష్మి నా లైఫ్.. కాని లవ్ లేదు..!

December 12, 2019


img

బుల్లితెర క్రేజీ కపుల్ ఎవరంటే వెంటనే అందరు చెప్పేది సుడిగాలి సుధీర్, రష్మిల గురించే.. జబర్దస్త్ లో యాంకర్, కంటెస్టంట్ గా మొదలైన వీరి ప్రయాణం చాలా దూరం వెళ్లింది. ముఖ్యంగా రష్మికి సుధీర్ ప్రపోజ్ చేయడం ఆమె కాదని చెప్పడం ఇది చాలా కామన్. కొద్దిగా క్రేజ్ రాగానే తాను హీరో మెటీరియల్ అని చెబుతూ వస్తున్న సుధీర్ నిజంగానే ఇప్పుడు హీరోగా మారాడు.

సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో అతను హీరోగా చేశాడు. ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు సుధీర్. అందరు రష్మి గురించి అడుగుతున్నారు. రష్మి తను కేవలం ఫ్రెండ్స్ మాత్రమే తనతో ఎలాంటి పర్సనల్ రిలేషన్ షిప్ లేదని అన్నాడు సుధీర్. కాకపోతే తనే లైఫ్ అంటూ మళ్లీ తిరకాసు పెట్టాడు. ప్రేమ కాదంటూ లైఫ్ అనడం ఏంటంటే ఆమెతో లవ్ అని వెంట పడటం వల్లే తనకు క్రేజ్ వచ్చిందని. ఇప్పుడు తను ఇంత మంచి పొజిషన్ లో ఉన్నా అంటే దానికి ఒక కారణం రష్మి కూడా అంటున్నాడు సుధీర్. 



Related Post

సినిమా స‌మీక్ష