డియర్ కామ్రేడ్ కు అవార్డ్ అందుకున్న విజయ్ దేవరకొండ..!

December 09, 2019


img

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్లాప్ మూవీ డియర్ కామ్రేడ్ సినిమాతో కూడా అవార్డ్ గెలుచుకున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో బాగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాతో కూడా సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత టాక్సీవాలా కూడా హిట్ అయ్యింది. ఈ ఇయర్ వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ చేశారు. అర్జున్ రెడ్డి రేంజ్ లో ఆడుతుందని భావించిన ఆ సినిమా నిరాశపరచింది.

అయినా కూడా విజయ్ కు మిగతా భాషల్లో కూడా ఒక ఇమేజ్ తెచ్చి పెట్టింది ఆ సినిమా. ఇప్పుడు అవార్డ్ కూడా వచ్చింది. బిహైండ్ వుడ్స్ వారు ఇచ్చే గోల్డెన్ అవార్డ్స్ తెలుగుకు గాను ఈ సంవత్సరం విజయ్ దేవరకొండకు వచ్చింది. డియర్ కామ్రేడ్ సినిమాలో అతని నటనకు ఈ అవార్డ్ ఇచ్చారు. 7 ఏళ్లుగా బిహైండ్ వుడ్స్ వారు అవార్డులు ఇస్తున్నారు. ఈ ఇయర్ మన రౌడీ స్టార్ కు అవార్డ్ వచ్చింది. చెన్నైలో రీసెంట్ గా జరిగిన ఈ అవార్డ్ కార్యక్రమంలో కె.జి.ఎఫ్ చేతుల మీదుగా విజయ్ దేవరకొండ ఈ అవార్డ్ అందుకోవడం క్రేజీగా మారింది.Related Post

సినిమా స‌మీక్ష