సరిలేరు సెకండ్ సాంగ్ ఎలా ఉందంటే..!

December 09, 2019


img

సూపర్ స్టార్ మహేష్ క్రేజీ హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ మూవీని అనీల్ రావిపుడి డైరెక్ట్ చేస్తున్నారు. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన మొదటి సాంగ్ మైండ్ బ్లాంక్ మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. కొద్ది గంటల క్రితం ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. 

సూర్యుడివో.. చంద్రుడివో అంటూ సాగే ఈ సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించగా బాలీవుడ్ సింగర్ ఫ్రాక్ పాడటం జరిగింది. మెలోడీ సాంగ్ గా సినిమా థీం ను చెప్పేలా ఈ పాట వచ్చింది. అయితే సాహిత్యం అంతా బాగున్నా దేవి మ్యాజిక్ మిస్ అయ్యిందని మాత్రం అనిపిస్తుంది. ఇదివరకు దేవి పాటలు వినంగానే బాగా నచ్చేవి. ఇప్పుడు కాస్త ట్రాక్ తప్పినట్టు ఉన్నాడు. మరి సినిమాలో ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష