అభిమాని కుటుంబానికి 'మెగా' సాయం..!

December 09, 2019


img

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ యూత్ ప్రెసిడెంట్ నూర్ అహ్మద్ ఆదివారం మరణించడం జరిగింది. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నూర్ భాయ్ మృతి మెగా ఫ్యామిలీలో విషాద చాయలు అలముకున్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు నూర్ భాయ్ ఎన్నో సేవలు అందించారని తెలుస్తుంది. నూర్ భాయ్ ఆధ్వర్యంలో ఎన్నో సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారట. అందుకే నూర్ భాయ్ మరణ వార్త విన్న చిరంజీవి, అల్లు అరవింద్ లు అతన్ని ఆఖరి చూపు చూసేందుకు వచ్చారు.     

నూర్ భాయ్ మరణ వార్త తెలుసుకున్న రాం చరణ్ షూటింగ్ లో ఉండటం వల్ల రావడం కుదరలేదు. తన ఫ్యామిలీలో ఒక వ్యక్తిని కోల్పోయామని చరణ్ అన్నారు. అప్పట్లో నూర్ అహ్మద్ హాస్పిటల్ లో ఉన్న ఒక ఫోటోని షేర్ చేశారు. అంతేకాదు నూర్ అహ్మద్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. నూర్ భాయ్ కుటుంబానికి 10 లక్షల ఆర్ధిక సహాయం చేస్తున్నట్టుగా ప్రకటించారు రాం చరణ్. అభిమానుల మేలు కోరడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటుందని మరోసారి ఈ విషయంతో తేలింది. Related Post

సినిమా స‌మీక్ష