అల్లు అర్జున్ అల వైకుంఠపురములో టీజర్ గ్లింప్స్..!

December 09, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యింది. వచ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బన్ని సరసన డిజే బ్యూటీ పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన 3 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక బుధవారం అల వైకుంఠపురములో టీజర్ రాబోతుంది. అయితే ఈలోగా బన్ని ఫ్యాన్స్ కు మెగా ఫ్యాన్స్ కు కానుకగా టీజర్ కు టీజర్ అదేనండి టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అర నిమిషం కూడా లేని ఈ టీజర్ లో బన్ని స్టైల్ అదిరింది. చూస్తుంటే త్రివిక్రం, అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్ పక్కా కొట్టేలా ఉన్నారు. సినిమాలో టబు కూడా నటిస్తుందని తెలిసిందే. మరి అల వైకుంఠపురములో సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.  

Related Post

సినిమా స‌మీక్ష