మహేష్ కు గెస్ట్ గా చరణ్..?

December 09, 2019


img

సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి ఈ మూవీ నిర్మిస్తున్నారు. రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా తప్పకుండా మహేష్ ఈ మూవీతో హ్యాట్రిక్ కొడతాడని అంటున్నారు.

ఇక ఈ సినిమా జనవరి 11న రిలీజ్ అవుతుందని తెలుస్తుండగా.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి మొదటి వారంలో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అతనెవరో కాదు మెగా పవర్ స్టార్ రాం చరణ్ అని అంటున్నారు. మహేష్ చరణ్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పుడప్పుడు వీళ్ళు కలిసి దిగిన పిక్స్ ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేస్తారు. సినిమాల పరంగా పోటీ ఉన్నా ఆఫ్ స్క్రీన్ వీరు చాలా క్లోజ్ గా ఉంటారు. అందుకే మహేష్ సినిమాకు చరణ్ గెస్ట్ గా వస్తాడని అంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు పోటీగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా వస్తుంది మరి చరణ్ ఆ సినిమా ఈవెంట్ కు వెళ్ళకుండా మహేష్ సినిమా ఈవెంట్ కు ఓకే చెప్పడం విశేషం.Related Post

సినిమా స‌మీక్ష