ప్రభాస్ 'జాన్' రిలీజ్ ఎప్పుడంటే..!

December 06, 2019


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత చేస్తున్న సినిమా జాన్. రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రోమ్ బ్యాక్ డ్రాప్ లో అందమైన ప్రేమకథతో వస్తుంది. సాహో హిందీలో హిట్ అనిపించుకున్నా తెలుగు ఆడియెన్స్ ను నిరాశపరచింది. అందుకే జాన్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రభాస్ కూడా టార్గెట్ మిస్ అవకూడదని జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. 

ఈ సినిమా అసలైతే 2020 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని కుదరలేదు. అందుకే 2020 సమ్మర్ లో జాన్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాను కూడా తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో భారీగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమా బడ్జెట్ 150 కోట్ల దాకా పెడుతున్నట్టు టాక్. బాహుబలి తర్వాత మార్కెట్ పెంచుకున్న ప్రభాస్ ఆ రేంజ్ కు తగినట్టుగానే సినిమాలు చేస్తున్నాడు. మరి సాహో నిరాశపరచగా జాన్ అయినా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష