బిగ్ బాస్ 4 ఎన్టీఆర్ రావాల్సిందేనా..!

December 06, 2019


img

మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో నాల్గవ సీజన్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. సీజన్ 1 ఎన్టీఆర్, సీజన్ 2 నాని హోస్ట్ గా చేయగా సీజన్ 3ని కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసారు. ఇక నాల్గవ సీజన్ కూడా నాగ్ హోస్ట్ గా చేస్తాడని అన్నారు కాని బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఎన్టీఆర్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. 

బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ గా ఎన్టీఆర్ హోస్ట్ గా చేయడం దాదాపు కన్ఫాం అంటున్నారు. ప్రస్తుతం తారక్ ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక మరో సినిమా గ్యాప్ లో బిగ్ బాస్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఏదైనా ఎన్టీఆర్ హోస్ట్ గా ఉంటే ఆ హంగామా వేరేలా ఉంటుంది. తారక్ ను ఒప్పించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు భారీ మొత్తాన్నే ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష