అక్కినేని హీరోకి 'నో' చెప్పిందా..?

December 02, 2019


img

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో చేస్తున్న రష్మిక నితిన్ భీషంలో కూడా నటిస్తుంది. ఈ సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబో మూవీలో కూడా ఆమెను తీసుకున్నారని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈమధ్య బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమాకు అడిగితే రష్మిక నో చెప్పిందట.

ఇక లేటెస్ట్ గా అక్కినేని నాగ చైతన్య హీరోగా పరశురాం డైరక్షన్ లో సినిమాకు రష్మిక సారీ అనేసిందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాలో లక్కీ ఛాన్స్ వచ్చినా సరే డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని షాక్ ఇచ్చిందట. నాగ చైతన్యతో సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న రష్మిక మీద అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సరిలేరు హిట్ అయితే రష్మికను అందుకోవడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.  Related Post

సినిమా స‌మీక్ష