జబర్దస్త్ షాక్.. నాగబాబు ప్లేస్ లో అతనొచ్చాడు..!

December 02, 2019


img

ఈటివి కామెడీ షో జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్లేస్ లో ఎవరు వస్తారా అని ఎక్సైటింగ్ గా ఎదురుచూశారు. అయితే ఒక వారం మాత్రం యువ హీరోలతో నడిపించిన జబర్దస్త్ టీం ఈ వారానికి స్టార్ కమెడియన్ అలిని జడ్జిగా ఒప్పించారు. ఆల్రెడీ ఈటివిలోనే ఆలితో సరదాగా షో సూపర్ సక్సెస్ అయ్యింది.    

ఇక ఇప్పుడు అలి ఎంట్రీతో జబర్దస్త్ కు కొత్త కళ వచ్చింది. నాగబాబు వెళ్లడం వల్ల జబర్దస్త్ కు పెద్ద నష్టమేమి లేదని కొందరు అంటున్న మాట. అయితే బయటకు వెళ్లిన ఆయన రెండు రోజులకు ఒక వీడియో పెడుతూ ఇన్నాళ్లు చేసిన జబర్దస్త్ మీద విమర్శలు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అక్కడ కమెడియన్స్ కు ఎలాంటి సమస్య వచ్చినా ఈటివి గాని.. మల్లెమాల సంస్థ గాని అసలు పట్టించుకోదని లేటెస్ట్ నాగబాబు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Related Post

సినిమా స‌మీక్ష