మహేష్ సినిమా పాటల హంగామా..!

November 30, 2019


img

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా పాట హంగామా మొదలు కాబోతుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలోని 5 పాటలను 5 సోమవారాలు రిలీజ్ చేయనున్నారట. ప్రతి సోమవారం ఒక పాట రిలీజ్ అవుతుందన్నమాట.

డిసెంబర్ 2న సరిలేరు ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఆగష్టు 15న సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ రిలీజైంది. సో ఈ సోమవారం రెండో పాట రానుంది. కొన్నాళ్లుగా తన మార్క్ సంగీతాన్ని ఇవ్వడంలో వెనుకపడుతున్న దేవి శ్రీ ప్రసాద్ మహేష్ సినిమాతో మళ్లీ తన సత్తా చాటుతాడని అంటున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.  Related Post

సినిమా స‌మీక్ష