ప్రభాస్ ను కలిస్తే అదే పనట..!

November 30, 2019


img

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు టక్కున చెప్పే పేరు పూజా హెగ్దె. మొదట్లో కెరియర్ కాస్త నెమ్మైదిగా నడిచినా డిజే తర్వాత అమ్మడి స్టార్ తిరిగిపోయింది. ఈమధ్యనే గద్దలకొండ గణేష్ తో సూపర్ హిట్ అందుకున్న పూజా హెగ్దె ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ జాన్ మూవీలో నటిస్తుంది పూజా హెగ్దె. జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న జాన్ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 

ప్రభాస్ తో షూటింగ్ పాల్గొంటున్న టైంలో అతని గురించి బాగా తీలుసుకున్న పూజా ప్రభాస్ నిజంగా అందరికి డార్లింగ్ అనేస్తుంది. ఇక ఆయన కలిస్తే చాలు రెస్టారెంట్ కు వెళ్లి బిర్యాని తినడం మాత్రం అసలు మిస్ అవదని అంటుంది పూజా. మాములుగా భోజన ప్రియుడైన ప్రభాస్ ఇక అందమైన అమ్మాయి అడిగితే కాదని అంటాడా చెప్పండి.  ప్రభాస్ ను కలిస్తే మొదట పూజాకి ఆకలేస్తుందని చెబుతుంది. మరి ప్రభాస్ కంపెనీ అమ్మడికి బాగా కంఫర్టబుల్ గా ఉందని అనుకుంటా అంటున్నారు ప్రేక్షకులు.Related Post

సినిమా స‌మీక్ష