హైదరాబాద్ ఖాళీ చేసిన రకుల్..!

November 30, 2019


img

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ ఖాళీ చేసిందని తెలుస్తుంది. తెలుగులో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన రకుల్ ఈమధ్య ఇక్కడ పెద్దగా అవకాశాలు అందుకోవట్లేదు. అందుకే హైదరాబాద్ నుండి అమ్మడు తన మఖాం మార్చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈమధ్య రకుల్ తెలుగు హీరోతో డేటింగ్ లో ఉన్న వార్తలు బాగా వస్తున్నాయి.              

అందుకే ఈ రూమర్స్ కు చెక్ పెట్టేందుకు రకుల్ హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లిందట. అంతేకాదు తెలుగులో అవకాశాలు సన్నిగిల్లిన రకుల్ కు ఇప్పుడు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. అందుకే అమ్మడు అక్కడకు షిఫ్ట్ అయ్యిందని అంటున్నారు. హైదరాబాద్ లో ఇల్లు ఖాళీ చేసిన రకుల్ రీసెంట్ గా బెంగళూరులో మరో ఇల్లు కొన్నదని తెలుస్తుంది. తెలుగు, తమిళంలో క్రేజ్ తగ్గిన రకుల్ మిగతా సౌత్ భాషల్లో పాగా వేయాలని చూస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష