భాగమతి దుర్గావతి అయ్యింది..!

November 30, 2019


img

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో పిల్లజమిందార్ అశోక్ డైరెక్ట్ చేసిన సినిమా భాగమతి. తెలుగులో సూపర్ హిట్టైన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. హిందిలో కూడా అశోక్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. బాలీవుడ్ భాగమతి సినిమాకు దుర్గావతి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అక్షయ్ కుమార్, టి సీరీస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.   

బాలీవుడ్ లో ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ నటిస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న భూమి దుర్గావతికి పర్ఫెక్ట్ అని అంటున్నారు. ఇక ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తూ డైరక్టర్, ప్రొడ్యూసర్ కలిసి ఓ పిక్ షేర్ చేశారు. అక్షయ్ ప్రెజెన్స్ లో వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి తెలుగులో హిట్టైన ఈ సినిమా అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష