కళ్యాణ్ రామ్ సినిమాకు కష్టాలేలా..!

November 30, 2019


img

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎంత మంచివాడవురా. శివలెంక కృష్ణ ప్రసాద్, ఆదిత్య మ్యూజిక్ వారు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. 2020 సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే సంక్రాంతి బరిలో మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ కానున్నాయి.     

ఈ సినిమాల మధ్య కళ్యాణ్ రామ్ సినిమా రాబోతుంది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కళ్యాణ్ రామ్ సినిమా కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారట. జనవరి పోరులో మహేష్, అల్లు అర్జున ల మధ్యే టఫ్ ఫైట్ జరుగుతుంది. అలాంటిది కళ్యాణ్ రామ్ సినిమా ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో అని డౌట్ పడుతున్నారట. ఎంత మంచివాడవురా సినిమా బిజినెస్ కూడా పెద్దగా జరగట్లేదని తెలుస్తుంది. ఓ పక్క జనవరి 9న రజినికాంత్ దర్బార్ సినిమా కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ మూడు సినిమాల మధ్య కళ్యాణ్ రామ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.    


Related Post

సినిమా స‌మీక్ష