బాలయ్య 'రూలర్' టీజర్.. ఇక రికార్డుల వేటే..!

November 21, 2019


img

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రూలర్. సి.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సి కళ్యాణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. బాలకృష్ణ సినిమాకు ఉండాల్సిన అంశాలన్ని ఈ సినిమాలో ఉన్నాయి.

యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్ ఇలా అన్నిటిలో రూలర్ అదరగొట్టేలా ఉంది. ధర్మ పాత్రలో బాలకృష్ణ మరోసారి తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరించేలా ఉన్నాడు. డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ మెప్పించగా సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.  





Related Post

సినిమా స‌మీక్ష