RRR హీరోయిన్ ను తెగ వెతికేశారట..!

November 21, 2019


img

బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాలో ఛాన్స్ అంటే అది సాధారణమైన విషయం కాదు. అలాంటి ఆఫర్ ను అందుకుంది లండన్ బ్యూటీ ఒలివియా మోరిస్. లండన్ లో థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒలివియా మోరిస్ అక్కడ టివి సీరీస్ లలో నటిస్తుంది. ఆర్.ఆర్.ఆర్ లో ఎన్.టి.ఆర్ కు జోడీగా ఆమె పర్ఫెక్ట్ అనుకున్న జక్కన్న ఒలివియా మోరిస్ ను ఫైనల్ చేశాడు. ఈ సినిమాలో ఒలివియా జెన్నిఫర్ రోల్ లో నటిస్తుంది. తారక్ కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తుందని తెలుస్తుంది.  

ఇక ఈ హీరోయిన్ పేరుని ఎనౌన్స్ చేయడమే ఆలస్యం గూగుల్ లో ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారట. ఒలివియా మోరిస్ పేరు ఎనౌన్స్ చేయడమే ఆలస్యం గూగుల్ సెర్చింగ్ లో ఆమె టాప్ పొజిషన్ లో నిలిచింది. తను ఓకే చెప్పిన సినిమా రేంజ్ ఏంటన్నది ఒలివియా మోరిస్ కు కూడా అర్ధమై ఉండొచ్చు. సినిమా జస్ట్ ఓకే చేస్తేనే ఇలా ఉంది అంటే ఇక సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇంకెలా ఉండబోతాయి. వాటిని ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఊహించుకుంటేనే సూపర్ అనిపిస్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష