90 ML ట్రైలర్.. అన్ ఆథరైజెడ్ డ్రింకర్..!

November 21, 2019


img

యువ హీరో కార్తికేయ, నేహా సోలంకి జతగా శేఖర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా 90 ఎం.ఎల్. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. చిన్నప్పటి నుండి రోజు మందు తాగే అలవాటు కాదు కాదు అవసరం పడిన ఓ హీరో.. అసలు మందు వాసనే ఇంట్లో పడని అమ్మాయితో ప్రేమలో పడతాడు.. ఇక ఆ కుర్రాడు ప్రేమ కోసం ఎలాంటి తిప్పలు పడ్డాడు అన్నదే 90 ఎం.ఎల్ సినిమా కథ.

నీతో కలిసి చచ్చేత ప్రేమ నాలో ఉంది.. కాని నాతో కలిసి బ్రతకాలనే ఆలోచన నీలో లేదు అంటూ హీరోయిన్ ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంది. ఫైనల్ గా మందు తాగకపోతే చస్తావా అంటే అవును ఒకరోజు మందు తాగకపోతే చచ్చిపోతా అంటాడు హీరో. మరి ఈ మందు బాబు ప్రేమ కహాని ఏంటన్నది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 90 ఎం.ఎల్ అన్ ఆథరైజెడ్ డ్రింకర్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా అనిపించింది సినిమా ఎలా ఉంటుందో చూడాలి. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.  




Related Post

సినిమా స‌మీక్ష