RRR.. ఎన్.టి.ఆర్ జోడీగా ఎవరంటే..!

November 20, 2019


img

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి మరో బిగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. సినిమాలో ఎన్.టి.ఆర్ కు జోడీగా లండన్ థియేటర్ ఆర్టిస్ట్ ఒలివియా మోరిస్ నటిస్తుందని ఆర్.ఆర్.ఆర్ యూనిట్ ప్రకటించారు. 7 ట్రైల్స్ ఇన్ 7 డేస్ అనే టివి సీరీస్ లో ఆమె నటించింది. సినిమాలో తారక్ కు జోడీగా జెన్నిఫర్ పాత్రలో ఒలివియా మోరిస్ నటించనుంది. ఇక సినిమాలో విలన్స్ ను ఇంట్రడ్యూస్ చేశాడు రాజమౌళి.

రే స్టీవెన్సన్ ఈ సినిమాలో మెయిన్ విలన్ స్కాట్ పాత్రలో నటిస్తుండగా అతని భార్య లేడీ స్కాట్ గా అలిసెన్ డూడీ నటిస్తున్నారు. మొత్తానికి సినిమా రేంజ్ కు తగినట్టుగానే విదేశీ నటులను ఎంపిక చేసుకున్నాడు రాజమౌళి. మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రైజ్ కాడు కాబట్టే ఇప్పటివరకు అతనికి ఓటమి అనేదే ఎదురుకాలేదు. ఈ ఎనౌన్స్ మెంట్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.    



Related Post

సినిమా స‌మీక్ష