సురేష్ బాబు ఇల్లు, ఆఫీస్ లపై ఐటి దాడులు..!

November 20, 2019


img

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఇల్లు, ఆఫీస్ లపై ఐటి రైడ్స్ జరిగాయి. బుధవారం ఉదయం నుండి సురేష్ బాబు ఇల్లు, ఆఫీస్, రామానాయుడు స్టూడియోస్ అన్నిటిలో ఐటి సోదాలు జరిపారు. కొన్నాళ్లుగా ఆదాయపు పన్ను కట్టకుండా ఉన్న కారణంగానే ఈ దాడులు జరిపినట్టు చెబుతున్నారు. అయితే ఈ రైడింగ్ లో కీలక డాక్యుమెంట్స్ వారు తీసుకోవడం జరిగిందట.     

సడెన్ గా తెలుగు చిత్ర నిర్మాత సురేష్ బాబు ఇంటిపై, ఆఫీస్ పై ఐటి దాడులు జరగడంతో ఒక్కసారిగా టాలీవుడ్ అంతా షాక్ అయ్యింది. సురేష్ బాబుతో పాటుగా హీరో నాని ఇల్లు, ఆఫీస్ ల మీద కూడా ఐటి అధికారులు దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే వీరు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ఏంటన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. 



Related Post

సినిమా స‌మీక్ష