ఎన్.టి.ఆర్ మరోసారి నో చెప్పాడా..!

November 20, 2019


img

బయోపిక్ ల హవా నడుస్తున్న టైంలో ఆ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవడంతో బయోపిక్ సినిమాల మీద మరింత క్రేజ్ పెరిగింది. లేటెస్ట్ గా తమిళంలో జయలలిత బయోపిక్ గా తళైవి మొదలైన విషయం తెలిసిందే. ఏ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తున్నారు. జయలలిత జీవితంలో సినిమా గ్లామర్ కూడా ఉంది. అందుకే ఎన్.టి.ఆర్ కు సంబందించిన సీన్స్ కూడా ఉన్నాయట.     

మహానటి సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్రకు జూనియర్ ఎన్.టి.ఆర్ ను అడుగగా ఆయన నో చెప్పడంతో ఆ పాత్ర లేకుండానే సినిమా కానిచ్చారు. ఇక ఇప్పుడు తళైవి సినిమా కోసం సీనియర్ ఎన్.టి.ఆర్ పాత్ర కోసం తారక్ ను అడిగారట. ఇప్పుడు కూడా ఎన్.టి.ఆర్ ఆ పాత్ర పోశించడం తన వల్ల కాదని చెప్పాడట. తాతలా నటించడం నా వల్ల కాదని చెప్పాడు తారక్. అయితే ఈసారి తళైవి యూనిట్ కు డేట్స్ అడ్జెస్ట్ కావట్లేదని చెప్పి తప్పించుకున్నాడు. మొత్తానికి తాత పాత్రలో తారక్ నటించడానికి సిద్ధంగా లేడు అన్నది మాత్రం తెలుస్తుంది. 


Related Post

సినిమా స‌మీక్ష