RRR క్రేజీ అప్డేట్

November 19, 2019


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై స్పెషల్ అప్డేట్ ఇప్పుడు సిని లవర్స్ ను ఎక్సైటింగ్ కు గురిచేస్తుంది. కొన్నాళ్లుగా ఈ సినిమా గురించి సైలెంట్ గా ఉండగా రకరకాల రూమర్స్ వచ్చాయి. సినిమాలో తారక్, రాం చరణ్ నటిస్తుండగా ఇప్పటివరకు ఒక హీరోయిన్ మాత్రమే ఫైనల్ అయ్యింది. సెకండ్ హీరోయిన్ ఎవరన్నది ఇంకా చెప్పలేదు. అయితే లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ యూనిట్ తమ ట్విట్టర్ ఖాతాలో నవంబర్ 20న సినిమాలో సెకండ్ హీరోయిన్ తారక్ జోడీ ఎవరన్నది రివీల్ చేస్తారట.  

అంతేకాదు సినిమాలో విలన్ ఎవరన్నది కూడా చెబుతారని తెలుస్తుంది. ఇప్పటివరకు గడిచిన షూటింగ్ మొత్తం అద్భుతంగా వచ్చిందని.. సినిమా దాదాపుగా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని షాక్ ఇచ్చారు. మరి వచ్చే ఎనౌన్స్ మెంట్ తో ఆర్.ఆర్.ఆర్ పై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మరి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆ సెకండ్ హీరోయిన్ ఎవరు.. ఇలాంటి ప్రెస్టిజియస్ ప్రాజెక్టులో విలన్ గా నటిస్తున్నది ఎవరన్నది తెలియాలంటే రేపు ఆర్.ఆర్.ఆర్ యూనిట్ ఎనౌన్స్ మెంట్ రావాల్సిందే.



Related Post

సినిమా స‌మీక్ష