సుకుమార్.. బన్ని.. ఓ రివెంజ్ స్టోరీ

November 16, 2019


img

రంగస్థలంతో ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టిన సుకుమార్ తను హిట్టు కొడితే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూపించాడు. ఆ సినిమా తర్వాత అసలైతే మహేష్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా అది కుదరలేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట.  

సినిమా కథ ఓ రివెంజ్ స్టోరీ అని తెలుస్తుంది. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో రెండు రివెంజ్ స్టోరీలే.. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కూడా రివెంజ్ స్టోరీగా వస్తుందట. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత బన్నితో సుక్కు చేస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సుకుమార్, అల్లు అర్జున్ ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష