సరిలేరు నీకెవ్వరు టీజర్ వచ్చేస్తుంది..!

November 16, 2019


img

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే టీజర్ లోడింగ్ అంటూ లేటెస్ట్ ట్వీట్ తో సరిలేరు నీకెవ్వరు డైరక్టర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.

మహేష్ గన్ లోడ్ చేస్తున gif ఫైల్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు. త్వరలోనే అన్నాడంటే ఈ వారంలోనే మహేష్ టీజర్ సందడి చేస్తుండొచ్చని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా అదరగొడుతుందని అంటున్నారు. సంక్రాంతికి పోటీగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా వస్తుంది. ఆ సినిమాకు టఫ్ ఫైట్ ఇచ్చేలా మహేష్ సినిమా సిద్ధమవుతుంది. 

     


Related Post

సినిమా స‌మీక్ష