వెబ్ సీరీస్ లో హాన్సిక..!

November 15, 2019


img

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హాన్సిక ఈమధ్య కెరియర్ లో వెనుకపడ్డదని చెప్పొచ్చు. తెలుగులో దేశముదురు సినిమాతో తెరంగేట్రం చేసిన హాన్సిక తెలుగులో కన్నా తమిళంలో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. లేటెస్ట్ గా తెలుగులో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన తెనాలి రామకృష్ణ సినిమాలో నటించింది. కొన్నాళ్లుగా తెలుగు తెరకు దూరంగా ఉన్న హాన్సిక ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక సినిమాలతో పాటుగా ఈమధ్య వెబ్ సీరీస్ ల మీద కూడా హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హాన్సిక కూడా ఓ క్రేజీ వెబ్ సీరీస్ లో నటిస్తుందని తెలుస్తుంది. పిల్ల జమిందార్, భాగమతి సినిమాతో హిట్ అందుకున్న అశోక్ ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో హాన్సిక సూపర్ హాట్ గా కనిపిస్తుందట. ఎలాగు కెరియర్ అటుఇటుగా ఉన్న ఇలాంటి టైంలో హాన్సిక ఈ వెబ్ సీరీస్ తో అదరగొట్టడం ఖాయమని తెలుస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష