తమన్నా ముద్దు సీక్రెట్..!

November 14, 2019


img

దశాబ్ధ కాలం పైగా హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగు, తమిళ భాషల్లో స్టార్స్ అందరితో నటించిన ఈ అమ్మడు ఇంతవరకు ఒక్క హీరోకి లిప్ లాక్ ఇవ్వలేదట. హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిన ప్రతి సినిమా చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదు కాని సినిమాలో లిప్ లాక్ అంటే మాత్రం తనవల్ల కాదంటుంది తమన్నా. 

ఇప్పటి యూత్ సినిమాల్లో కనీసం ఒక లిప్ లాక్ అయినా ఆశిస్తున్నారు. అలాంటిది పదేళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉంటున్నా తమన్నా మాత్రం అదరచుంభనం ఇవ్వలేదట. అయితే ఒకవేళ తను నటించిన సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ ఉన్నా అది కెమెరా ట్రిక్ తప్ప తాను పెట్టింది కాదని అంటుంది తమన్నా. నటించడానికి తనకు కొన్ని షరతులు ఉంటాయని అవి ఒప్పుకుంటేనే ఏ సినిమాకు అయినా సైన్ చేస్తానని అంటుంది తమన్న. ఇప్పుడు అవకాశాలు తగ్గాయి కదా మరి ఇప్పుడైనా అందరిలా లిప్ లాక్స్ పై తన పట్టు విడుస్తుందో లేదో చూడాలి.     Related Post

సినిమా స‌మీక్ష