అల వైకుంఠపురములో చిల్డ్రెన్స్ డే స్పెషల్..!

November 14, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా నుండి 3వ సాంగ్ వచ్చేసింది. ఓ మై గాడ్ డాడీ అంటూ వచ్చే ఈ సాంగ్ ప్రోమో అల్లు అయాన్, అర్హాల మీద షూట్ చేశారు. ఓ మై గాడ్ డాడీ అంటూ అయాన్ తో రిలీజ్ అయిన ఈ సాంగ్ టీజర్ అల్లు ఫ్యాన్స్ ను అలరిస్తుంది. చిల్డ్రెన్స్ డే స్పెషల్ గా రిలీజైన ఈ సాంగ్ టీజర్ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు.

అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక థర్డ్ సాంగ్ గా వచ్చిన ఓ మై గాడ్ డాడీ కూడా హిట్ అయ్యేలా ఉంది. సినిమాకు ముందు ఆడియో హిట్టైతే ఇక సినిమా సగం హిట్ అయినట్టే. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.       

Related Post

సినిమా స‌మీక్ష