రవితేజ 'క్రాక్'

November 14, 2019


img

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ డైరక్షన్ లో డిస్కో రాజా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రవితేజ గోపిచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు టైటిల్ గా క్రాక్ అని ఫిక్స్ చేశారు. రవితేజ సినిమాలకు విచిత్రమైన టైటిల్స్ పెట్టడం కామనే. కిక్ అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఈసారి ఆడియెన్స్ అందరికి క్రాక్ ఎక్కించేందుకు రెడీ అయ్యాడు.

గోపిచంద్ తో ఆల్రెడీ డాన్ శీను, బలుపు సినిమాలు తీశాడు రవితేజ. ఈ రెండు సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. మరి ఈ క్రాక్ ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడట. ఈ మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ ఫైనల్ అవగా కోలీవుడ్ డైరక్టర్ కమ్ ఆర్టిస్ట్ సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ క్రాక్ లో ఉంటారని తెలుస్తుంది. ఈరోజు సినిమా ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్నాయి.               


Related Post

సినిమా స‌మీక్ష