జనవరి 1న RRR సర్ ప్రైజ్

November 13, 2019


img

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. కొమరం భీం గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగన్ వంటి వారు నటిస్తున్నారు. 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా అనుకున్న విధంగా షూటింగ్ జరుగుతుందట. సినిమా మొదలైన చాలా రోజులవుతున్నా సినిమాకు సంబందించిన పోస్టర్ ఒకటి బయటకు రాలేదు.  

ప్రతి ఫెస్టివల్ కు ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ గురించి మెగా నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేయడం.. తర్వాత నిరాశపడటం కామన్ అయ్యింది. అయితే ఆర్.ఆర్.ఆర్ స్పెషల్ అప్డేట్ న్యూస్ తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కొత్త సంవత్సరం నాడు ఆర్.ఆర్.ఆర్ సర్ ప్రైజ్ వస్తుందట. జనవరి 1న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఫస్ట్ పోస్టర్ వదులుతారట. పక్కా ప్లానింగ్ తోనే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ మొదలుపెడతారని తెలుస్తుంది. పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ ఎలా డిజైన్ చేయిస్తున్నాడో అని ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు.     



Related Post

సినిమా స‌మీక్ష