వరుణ్ తేజ్ తండ్రిగా స్టార్ హీరో..!

November 13, 2019


img

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ ఇయర్ ఇప్పటికే రెండు హిట్లు కొట్టాడు. గద్దలకొండ గణేష్ సినిమాతో వరుణ్ తేజ్ మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు తండ్రిగా కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ నటిస్తున్నాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణని సెలెక్ట్ చేశారట.

వరుణ్ తేజ్ తల్లిదండ్రులుగా నటిస్తున్న మాధవన్, రమ్యకృష్ణ పాత్రలకు మంచి స్కోప్ ఉంటుందని అంటున్నారు. తెలుగులో లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న మాధవన్ సవ్యసాచి సినిమాలో విలన్ గా నటించాడు. ప్రస్తుతం స్వీటీ అనుష్క నిశ్శబ్ధం సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు. వరుణ్ తేజ్ ఫాదర్ గా మాధవన్ ఎలా సర్ ప్రైజ్ చేస్తాడో చూడాలి.    



Related Post

సినిమా స‌మీక్ష