ప్రభాస్ కు నో చెప్పిందా..?

November 13, 2019


img

యంగ్ రెబల్ స్టార్ కు ఇప్పుడు భారీ క్రేజ్ ఏర్పడింది. బాహుబలి తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సినిమా ఛాన్స్ కోసం హీరోయిన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అతనితో ఛాన్స్ వస్తే నో అని చెప్పడం జరుగదు. కాని ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా సరే సారీ అనేసిందట రకుల్ ప్రీత్ సింగ్. అదేంటి అసలకే అమ్మడి చేతులో సినిమాలేవి లేవు కదా మరి అలాంటిది ప్రభాస్ సినిమా ఛాన్స్ ఎందుకు కాదన్నది అంటే అది ఇప్పటి మ్యాటర్ కాదట.

మిస్టర్ పర్ఫెక్ట్ టైంలోనిదని తెలుస్తుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రకుల్ ప్రభాస్ సినిమా మిస్సైన విషయాన్ని గుర్తుకుతెచ్చుకుంది. దశరధ్ డైరక్షన్ లో వచ్చిన ప్రభాస్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కాజల్ ప్లేస్ లో రకుల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. అయితే అప్పుడు తనకు అంతగా అవగాహన లేకపోవడంతో ఆ మూవీ ఛాన్స్ మిస్ అయ్యానని. అప్పుడు ఆ సినిమా వదులుకుని వెళ్లి చదువు కొనసాగించానని చెప్పింది రకుల్. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే అదే తన మొదటి సినిమా అయ్యి ఉండేదని చెప్పింది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  



Related Post

సినిమా స‌మీక్ష