అవసరాల శ్రీనివాస్ తో క్రిష్..!

October 19, 2019


img

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో నిరాశపరచిన డైరక్టర్ క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. అయితే డైరక్టర్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది తెలియదు కాని నిర్మాతగా మాత్రం మరో సినిమా మొదలు పెట్టాడు. క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డితో కలిసి ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు కూడా ఒక నిర్మాత అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోగా మాత్రం అవసరాల శ్రీనివాస్ ను ఎంపిక చేశారట.

ముగ్గురు నిర్మాతలు అవసరాల సినిమాకు ఇన్వెస్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సినిమాతో అవసరాల శ్రీనివాస్ ఫుల్ టైం హీరోగా మారడం ఖాయమని చెప్పొచ్చు. క్రిష్ నిర్మాత అంటే కచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంటుంది. అవసరాల శ్రీనివాస్ లాంటి కమెడియన్ కం హీరోని సెలెక్ట్ చేశారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. మరి క్రిష్ అవసరాల శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఏం చేస్తారో చూడాలి.    Related Post

సినిమా స‌మీక్ష