విజిల్ కూడా కాపీ అంటున్నారే..!

October 18, 2019


img

కోలీవుడ్ హీరో విజయ్ హీరోగా అట్లీ డైరక్షన్ లో వస్తున్న సినిమా విజిల్. తమిళంలో బిగిల్ అంటూ వస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దీవాళి కానుకగా ఈ నెల 25న రిలీజ్ అవుతుంది. అయితే విజయ్ ప్రతి సినిమాలానే ఈ సినిమాకు రిలీజ్ ముందు వివాదాలు ఏర్పడుతున్నాయి. విజిల్ సినిమా తన కథతో తీశారంటూ తెలంగాణా షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ చిన్ని కుమార్ తెలంగాణా రచయితల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

తను తీసిన స్లమ్ సాకర్ ఆధారంగా అట్లీ విజయ్ ను తీశారని. తన సినిమా ఆత్మను తీసుకుని అట్లీ విజిల్ సినిమా తీశారని. చిత్ర బృందంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణా రచయితల సంఘాన్ని కోరాడు చిన్ని కుమార్. అయితే విజిల్ సినిమాపై ఇప్పటికే దర్శకుడు కేపీ సెల్వ కేసు పెట్టారు. తన కథను కాపీ కొట్టి ఈ సినిమా తీశారని మద్రాస్ హైకోర్టులో పిటీషన్ వేశారు. కొత్తగా చిన్ని కుమార్ కూడా విజిల్ కథ తనదే అంటూ గొడవకు దిగాడు మరి ఈ గొడవల నుండి సినిమా ఎలా బయటపడుతుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష